స్వామి వారి రథం దగ్ధం.. మంత్రి దిగ్భ్రాంతి

6 Sep, 2020 10:15 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం చోటుచేసుకుంది. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.

మంత్రి వెల్లంపల్లి దిగ్భ్రాంతి
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన.. దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌, జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడారు. స‌హ‌య‌క చ‌ర్యులు చేప‌డుతున్న దేవ‌దాయ, పోలీస్‌, పైరింజ‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశిస్తూ.. దేవ‌దాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర‌మోహ‌న్‌ను విచార‌ణ అధికారిగా నియ‌మించారు. బాధ్యులను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అదే విధంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున: నిర్మాణానికి చ‌ర్యులు చేప‌ట్టాల‌ని దేవ‌దాయ క‌మిష‌న‌ర్‌కు మంత్రి సూచించారు.

అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన

అంతర్వేది ఘటన దురదృష్టకరం -స్వరూపానందేంద్ర

రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి -స్వరూపానందేంద్ర

దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి -స్వరూపానందేంద్ర

హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిది -స్వరూపానందేంద్ర

నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి -స్వరూపానందేంద్ర

మరిన్ని వార్తలు