హైదరాబాద్‌లో మరో భారీ భూ కుంభకోణం

17 Sep, 2020 21:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. ఫోర్జరీ పత్రాలతో రూ.300 కోట్ల విలువైన స్థలం ఆక్రమించినట్టు వెల్లడైంది. కబ్జాకోరుల ఆగడాలతో బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌-12లోని నాలుగున్నర ఎకరాలు వివాద స్థలంగా మారింది. కొనుగోలు చేసింది 2 ఎకరాల 21 గుంటలైతే నకిలీ పత్రాలతో 7 ఎకరాల కొన్నట్లు పత్రాలు సృష్టించారు అక్రమార్కులు. పక్కనున్న స్థలం కూడా తమదేనంటూ భవన నిర్మాణ అనుమతులు కూడా తెచ్చుకున్నారు. దీంతో ఆ స్థలం యజమాని శ్రీధర్‌ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నజీబ్‌ అహ్మద్‌తోపాటు ఆయా సంస్థలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
(చదవండి: బంజారాహిల్స్‌లో గుట్టలుగా హవాలా సొమ్ము)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా