శిష్యురాలికి ట్రైనింగ్‌.. ఆ వ్యక్తి చనిపోయాడని..

15 Jan, 2021 16:05 IST|Sakshi
ప్రమాద దృశ్యాలు

ముంబై : శిష్యురాలికి కారు డ్రైవింగ్‌ నేర్పాలనే ప్రయత్నం ఓ గురువును ఆమెతో పాటు జైలు పాలుచేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, వాసై ఈస్ట్‌ ఫాధర్‌వాడి.. విజయ్‌ రెసిడెన్షీకి చెందిన లాయర్‌ బీరేంద్ర మిశ్రా, అతడి శిష్యురాలు వర్షా మిశ్రాకు ఆదివారం కారు డ్రైవింగ్‌ నేర్పిస్తున్నాడు. మధువన్‌ ఏరియాకు చేరుకోగానే కారు ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళుతున్న ఇంద్రేశ్‌ యాదవ్‌ కిందపడి స్పృహ కోల్పోయాడు. ( ‘నా కూతురిని పొట్టనపెట్టుకున్నారు’)

దీంతో యాదవ్‌ చనిపోయాడని భావించిన ఇద్దరు అతడి బాడీని ముంబై-అహ్మదాబాద్‌ నేషనల్‌ హైవే దగ్గర పడేశారు. అయితే యాదవ్‌ను కారులోంచి కిందకు తీసి రోడ్డు పక్కన పడేయటాన్ని ఓ వ్యక్తి చూశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు