-

లాయర్‌ హత్య: విడాకుల కోసం వచ్చిన మహిళతో ఎఫైర్‌

20 Jul, 2021 07:15 IST|Sakshi
మృతి చెందిన న్యాయవాది వెంకటేషన్‌

న్యాయవాదిని హత్య చేసిన మహిళ బంధువులు  

తిరువళ్లూరు: జిల్లాలోని కాకలూరులో ఓ న్యాయవాది ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెల్లేరితాంగెల్‌ గ్రామానికి చెందిన న్యాయవాది వెంకటేషన్‌(35). ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్నై పెరంబూరు చెందిన సత్య(31) విడాకుల కోసం వెంకటేషన్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఇద్దరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. సత్య భర్త, పిల్లలను వదిలేసి వెంకటేషన్‌తో కాకలూరు, ఆంజనేయనగర్‌లో అద్దె ఇంట్లో ఉండేది.

న్యాయవాదుల రాస్తారోకో
సత్య పిల్లలు తరచూ తల్లి గురించి అడుగుతుండడంతో బంధువులు ఆదివారం రాత్రి సత్య ఉంటున్న ఇంటి వద్ద వచ్చి ఆమెకు నచ్చ చెప్పారు. సత్య నిరాకరించడం, వెంకటేషన్‌ సైతం వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆగ్రహించిన బంధువులు సత్య, వెంకటేషన్‌ను కత్తులతో నరికి పరారైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన సత్యను ఆస్పత్రికి తరలించారు. వెంకటేషన్‌ మృతి చెందినట్టు నిర్దారించి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఆరుగురు అరెస్టు
వెంకటేషన్‌ హత్య కేసులో ప్రధాన నిందితులుగా సత్య తండ్రి శంకర్‌(59), తల్లి చెల్లామ్మాల్‌(52), పిన్ని దేవి(46), తమ్ముడు వినోద్‌(25), సోదరి సంగీత(23), సంగీత భర్త వెంకట్‌ (25)లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. సోమవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హజరుపరిచి ఫుళల్‌ జైలుకు తరలించనున్నట్లు వివరించారు. న్యాయవాది హత్యను నిరసిస్తూ తిరుపతి–చెన్నై జాతీయ రహదారిలో సోమవారం న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు.

మరిన్ని వార్తలు