ఎల్బీ నగర్‌లో దారుణం: సీఐ ప్రాణాల్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌

14 Feb, 2024 09:59 IST|Sakshi

హైదరాబాద్‌, సాక్షి: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ఎల్బీ నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మృతి చెందగా.. ఎస్సై ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.   

హైదరాబాద్ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్‌ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కార్ యూటర్న్ చేస్తు రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీ కొట్టింది.  బైక్ పై ఉన్న ఒకరు మృతి చెందగా. మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని చార్మినార్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సాధిక్‌ అలీగా గుర్తించారు. 

అలాగే.. గాయపడిన వ్యక్తిని నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కాజా వల్లి మోహినుదిన్‌గా గుర్తించారు. వీళ్లిద్దరూ మలక్‌పేటలోని క్వార్టర్స్‌లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌ను వెళ్లి వస్తుండగా.. ఈ ఘోరం జరిగింది.

కారుపై ‘డేంజర్‌’ ఛలాన్లు
ఇదిలా ఉంటే.. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కారు వినుషాశెట్టి అనే పేరుపై రిజిస్ట్రేషన్‌ అయ్యి ఉంది. అంతేకాదు.. కారుపై ఓవర్‌ స్పీడ్‌, డేంజర్‌ డ్రైవింగ్‌ ఛలాన్లు ఉండడం గమనార్హం. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega