అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువులు మృతి

9 Jan, 2021 07:54 IST|Sakshi

ఘటనపై అమిత్‌ షా విచారం

ప్రభుత్వం వారిని ఆదుకోవాలి: రాహుల్‌ గాంధీ

ముంబై: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాద ఘటనలో పది మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. భండారా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో చిన్నపిల్లల అత్యవసర విభాగం(ఎస్‌ఎన్‌సీయూ)లో చికిత్స పొందుతున్న పది మంది మరణించారు. మరో ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండిసుశాంత్‌ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు)

మాటలకు అందని విషాదం: అమిత్‌ షా
ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విచారం వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

ప్రభుత్వం వారిని ఆదుకోవాలి: రాహుల్‌ గాంధీ
బంఢారా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన విషాదకరమైందని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు