లెక్చరర్‌ పాడుబుద్ధి.. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ..

12 May, 2022 10:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తంబళ్లపల్లె(అన్నమయ్య జిల్లా): విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదైంది. వివరాలు.. ఎస్వీయూ సంస్కృత విభాగంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న మాధవరెడ్డిని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ఓ డిగ్రీ కాలేజీలో పరీక్షల పరిశీలకుడిగా నియమించారు. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ మంగళవారం విద్యార్థినితో మాధవరెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, ములకలచెరువు సీఐ షాదిక్‌ అలీ, ఎస్‌ఐ శోభారాణి.. మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆరోపణలు నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.
చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్‌!

మరిన్ని వార్తలు