లాక్‌డౌన్‌తో ఛాన్స్‌ల్లేక నటుడు ఆత్మహత్యాయత్నం

9 Jun, 2021 15:36 IST|Sakshi
ఫేస్‌బుక్‌ లైవ్‌లో నటుడు సువో చక్రవర్తి

కలకత్తా: మహమ్మవారి కరోనా వైరస్‌ విజృంభణతో ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. వెండితెర, బుల్లితెర రంగానికి కోలుకోలేని దెబ్బ పడింది. కళామతల్లీని నమ్ముకున్నవారు కూటికి గతిలేని వారయ్యారు. అవకాశాల్లేక అవస్థలు పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఓ టీవీ నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌తో అవకాశాలు లేక మనోవేదన చెందుతున్నాడు. నిరాశనిస్పృహాలతో చివరకు ప్రాణం తీసుకోవాలకున్నాడు. అయితే పోలీసులు సమయానికి వచ్చి రక్షించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.

సువో చక్రవర్తి (31) టీవీ నటుడు. గిటార్‌ ప్లేయర్‌ కూడా. తన తల్లి సోదరితో కలిసి నివసిస్తున్నాడు. అయితే గతేడాది కరోనా మొదటి దశ నుంచి అతడికి అవకాశాలు లేకుండా పోయాయి. నిరుద్యోగిగా మారి ఇంట్లో ఖాళీగా ఉండలేకపోతున్నాడు. మళ్లీ ఈ సంవత్సరం కూడా లాక్‌డౌన్‌ ఏర్పడడం సినీ, టీవీ రంగం మూతపడడంతో అతడికి గడ్డుకాలం వచ్చింది. తల్లి, చెల్లిని ఎలా పోషించాలో తెలియక డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ లైవ్‌ ఆన్‌ చేసి నిద్రమాత్రలు ఒక్క స్ట్రిప్‌ స్ట్రిప్‌ మింగేశాడు. ‘ఐ క్విట్‌’ (నేను వెళ్లిపోతున్నా) అని పోస్టు చేశాడు. ఇది చూసిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు సువో చక్రవర్తి నివాసానికి చేరుకుని రక్షించారు. అయితే గదిలో సువో చక్రవర్తి ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం తల్లి, సోదరికి పోలీసులు వచ్చేవరకు తెలియదు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. సువో చక్రవర్తి ‘మంగల్‌ చాంది’, ‘మానస’ వంటి సీరియల్స్‌ చేశాడు. అనంతరం అతడికి, వారి కుటుంబసభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

చదవండి: ఇంజెక‌్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు