క్వారీలో టిప్పర్‌ బోల్తా.. ముగ్గురి మృతి

19 Dec, 2021 01:45 IST|Sakshi

క్వారీలో టిప్పర్‌ బోల్తా.. ముగ్గురి దుర్మరణం 

హనుమకొండ జిల్లాలో ఘటన

మడికొండ: చీకట్లోనే విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కూలీలను క్వారీ గుంత మింగేసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామశివారులోని లక్ష్మి గ్రానైట్‌ క్వారీలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చిత్రం చందు(20), జార్ఖండ్‌ రాష్టానికి చెందిన మహ్మద్‌ హకీమ్‌(22)లు హెల్పర్లుగా, మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన కొతల ముఖేశ్‌(23) లారీడ్రైవర్‌గా ఆరునెలల నుంచి లక్ష్మి గ్రానైట్‌లో పనిచేస్తున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత హకీమ్, చందులు క్వారీలోని వేస్ట్‌ మెటీరియల్‌ను టిప్పర్‌లో తరలిస్తుండగా అది అదుపుతప్పి క్వారీ గుంతలో బోల్తాపడింది. దీంతో మహ్మద్‌ హకీమ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన చందు, డ్రైవర్‌ ముఖేశ్‌లను ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చందు చనిపోయాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ముఖేశ్‌ మృతిచెందాడు.   

చదవండి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మరిన్ని వార్తలు