పార్కింగ్‌ గొడవ.. ముగ్గురిపై లారీ ఎక్కించి పరార్‌

3 Jun, 2022 08:33 IST|Sakshi
నిందితుడు లాల్‌ సింగ్, మృతిచెందిన కమలకన్నన్‌

తిరువళ్లూరు(చెన్నై): మద్యం మత్తులో జరిగిన గొడవలో లారీ ఎక్కించి ఒకరిని హత్య చేసి, ఇద్దరిని గాయపరిచిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీడ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ఉత్తరపెరుంబక్కం గ్రామం దగ్గరలో ఉన్న ప్రైవేట్‌ పార్కింగ్‌ స్థలంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్ర, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన వారు లారీలను పార్కింగ్‌ చేస్తారు.

బుధవారం రాత్రి స్థానిక గ్రామానికి చెందిన కమలకన్నన్, కుమరన్, నవీన్‌ తదితరులు లారీ యార్డు వద్ద మద్యం సేవిస్తుండగా, అక్కడే పార్కింగ్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీని బయటకు తీయడానికి డ్రైవర్‌ లాల్‌సింగ్‌ యత్నించాడు. ఈ సమయంలో వారు తాము మద్యం సేవించిన తరువాతే లారీలను బయటకు తీయాలని లారీడ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్‌ లాల్‌సింగ్‌ ఆ ముగ్గురిపై లారీ ఎక్కించి పరారయ్యాడు. ఈ సంఘటనలో అక్కడికక్కడే కమల కన్నన్‌ మృతి చెందగా, ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. 

చదవండి: బంజారాహిల్స్‌: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన 

మరిన్ని వార్తలు