చెక్‌పోస్టు గార్డును ఢీకొట్టి చంపిన లారీడ్రైవర్‌

17 Sep, 2022 02:25 IST|Sakshi
 శ్రీనివాస్‌  

నవీపేట: ఆపేందుకు ప్రయత్నించిన చెక్‌పోస్టు గార్డును లారీతో ఢీ కొట్టి వెళ్లిపోయాడు ఓ డ్రైవర్‌. తీవ్ర గాయాలతో గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ పరిధి నవీపేటలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నవీపేటలోని బాసర రహదారి పక్కన ఉన్న చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం చెక్‌పోస్టులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఈర్నాల మందగోల్ల శ్రీనివాస్‌ (47) అటుగా వస్తున్న లారీని ఆపాలని సిగ్నల్‌ ఇచ్చాడు.

అయితే లారీ డ్రైవర్‌ లారీని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో శ్రీనివాస్‌ తన బైక్‌పై వాహనాన్ని వెంబడించి అభంగపట్నం శివారులో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లారీడ్రైవర్‌ శ్రీనివాస్‌ను వేగంగా ఢీకొ ట్టగా...అతడు రోడ్డు మీదే ఎగిరి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు