అనంతపురం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

6 Aug, 2022 10:06 IST|Sakshi

బెళుగుప్ప/ఉరవకొండ(అనంతపురం జిల్లా): బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయరులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన ఎజిత(16), బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన అజయ్‌(19) మృతదేహాలను శుక్రవారం సాయంత్రం జీడిపల్లి రిజర్వాయరులో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహాలను వెలికితీయడం సాధ్యం కాలేదు. శనివారం ఉదయం వెలికితీశారు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి.. సమగ్ర దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని బెళుగుప్ప ఎస్‌ఐ రుషేంద్రబాబు తెలిపారు.
చదవండి: నా చావుకు కారణం వారే.. పిన్ని వాయిస్‌ రికార్డ్‌ బయట పెట్టడంతో..

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు