లవ్ ఫెయిల్యూర్‌: రన్నింగ్‌ బస్సు దిగి.. హస్సేన్‌సాగర్‌లో దూకి.. 

1 Oct, 2021 09:19 IST|Sakshi

యువకుడి ఆత్మహత్యాయత్నం 

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు హుటాహుటిన రన్నింగ్‌ బస్సు నుంచి దిగి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి వివరాల ప్రకారం.. కలకత్తాకు చెందిన 23 సంవత్సరాల ఓ యువకుడు మౌలాలిలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆ యువకుడిని మందలించారు.
చదవండి: మన కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా ఉందంటూ..

దీంతో తీవ్ర భయాందోళనకు గురై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో వెళుతూ రన్నింగ్‌ బస్సులో నుంచి కిందకు దిగాడు. వెంటనే అంతే వేగంగా వెళ్లి హుస్సేన్‌సాగర్‌లోకి దూకాడు. వెంటనే అక్కడే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి నీళ్లలోకి దూకి అతడిని ఒడ్డుకు చేర్చారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులను పిలిపించిన ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి కౌన్సిలింగ్‌ నిర్వహించిన అనంతరం వారికి అప్పగించారు .ఆ  యువకుడిని కాపాడిన లేక్‌ కానిస్టేబుళ్లు అభిలాష్‌, రాజులను ఇన్‌స్పెక్టర్‌ అభినందించారు. 
చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్‌: అదే కిరణ్‌ ప్రత్యేకత

మరిన్ని వార్తలు