కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్‌

10 Aug, 2023 14:30 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్‌కు గురైంది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. వివరాలు.. ఖమ్మంకు చెందిన సన్నీ, కొత్తగూడెంకు చెందిన మాధవి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో   గురువారం ఆటోలో వెళ్తున్న దంపతులను కారులో ఛేజ్‌ చేసిన దుండగులు..భర్తపై దాడి చేసి, యువతిని బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు.

భార్యను ప్రాజెక్ట్‌ వర్క్‌ నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాలకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి కారణాలతోనే తనపై దాడి చేసి, భార్యను కిడ్నాప్‌ చేశారని భర్త సన్నీ చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు