మూణ్నెళ్ల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే

3 Sep, 2021 10:19 IST|Sakshi

పెళ్లయిన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య గొడవలు

భరించలేక ఆత్మహత్యకు యత్నం

చికిత్స పొందుతున్న కొత్త దంపతులు

ఇల్లెందు: క్షణికావేశంలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇద్దరిలో భర్త పరిస్థితి విషమంగా ఉంది.. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని నిజాంపేట పంచాయతీ రేపల్లెవాడకు చెందిన భూక్యా వేణు మూడు నెలల కిందట సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

మూడు నెలలకే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పురుగులమందు తాగేలా చేసింది. వేణు కలుపు నివారణకు కొట్టే మందు తాగగా సంధ్య విత్తనశుద్ధి చేసే మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వారిని ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఖమ్మానికి తరలించారు. వేణు పరిస్థితి విషయంగా ఉంది. వేణుకు తల్లి చీన్యా, సోదరుడు వీరన్న ఉండగా సంధ్యకు మాత్రం తల్లిదండ్రులు లేరు. రేపల్లెవాడలో తన పిన్ని ఇంటి వద్ద ఉండి బీఫార్మసీ వరకు చదువుకుంది.

చదవండి: కలెక్టరేట్‌లో గన్‌మెన్‌గా భర్త.. రోడ్డుపై విగతజీవిగా భార్య
చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి

మరిన్ని వార్తలు