ప్రేమ పెళ్లి.. మాట్లాడుకుందామని పిలిచి ఒక్కసారిగా..

22 Jun, 2021 17:34 IST|Sakshi

సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌: కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో దారుణం  చోటుచేసుకుంది‌.  అమ్మాయి తల్లిదండ్రులకు  ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. మాట్లాడుదామని యువకుడిని  పిలిచిన అమ్మాయి తల్లిదండ్రులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటన తిర్యాని మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై బాధిత యువకుడు రామును లాక్కొచ్చిన యువతి బంధువులు.. అతని విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో రాముకు తీవ్రంగా గాయాలయ్యాయి.

గాయపడిన యువకుడిని  చికిత్స కోసం  అసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు ఇష్టం లేని  పెళ్లి చెసుకున్నందుకు తన భర్తపై  తల్లిదండ్రులు దాడి చేయించారని కూమర్తె మడవి సమత పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు