-

తమిళనాడు ప్రేమజంట అదృశ్యం 

9 Aug, 2020 08:23 IST|Sakshi
అదృశ్యమైన శ్యామ్‌ శ్రీనివాస్, వర్ష   

రాజులకండ్రిగ ఆశ్రమంలో పోలీసుల విచారణ 

అదుపులోకి ఆశ్రమ నిర్వాహకుడు ప్రభు  

సాక్షి, చిత్తూరు : తమిళనాడుకు చెందిన ప్రేమజంట మిస్సింగ్‌ కేసుకు సంబంధించి నాగలాపురం మండలం రాజులకండ్రిగలో శనివారం తమిళనాడు పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల కథనం మేరకు నాగలాపురం మండలం రాజులకండ్రిగలో యోగ్యత పేరుపై  ప్రభు అనాథ ఆశ్రమం నడుపుతున్నారు. ఈ ఆశ్రమంలో కొంతమంది అనాథలు ఉన్నట్లు సమాచారం. ఈ ఆశ్రమానికి తమిళనాడుకు చెందిన కొంతమంది యువకులు వచ్చి వెళ్తుంటారు. తమిళనాడు రాష్ట్రం ఆవడి సమీపంలోని కిల్లికుప్పం గ్రామానికి చెందిన శ్యామ్‌ శ్రీనివాస్‌(32) ఆశ్రమానికి తరచూ వస్తూ.. ఆశ్రమ నిర్వాహకుడు ప్రభుకు పరిచయమయ్యాడు. శ్యామ్‌శ్రీనివాస్‌కు తిరువళ్లూరు జిల్లా తిరుమల్‌వాయిల్‌కు చెందిన వర్ష(20)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.  (విషాదం: తండ్రి మరణంతో కూతుళ్లు కూడా..)


రాజులకండ్రిగ ఆశ్రమం వద్ద విచారణ నిర్వహిస్తున్న తమిళనాడు పోలీసులు  (ఇన్‌సెట్‌లో) ఆశ్రమ నిర్వాహకుడు ప్రభు   

పది రోజుల కిందట శ్యామ్‌ శ్రీనివాస్, వర్ష పరారై రాజులకండ్రిగలోని ఆశ్రమానికి వచ్చేశారు. వర్ష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు పోలీసులు ఆశ్రమానికి చేరుకుని విచారణ జరిపారు. వర్షను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు రోజుల నుంచి వర్ష మళ్లీ కనబడలేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు సీఐ ఆర్‌ పురుషోత్తమన్‌ నేతృత్వంలో పోలీసులు శనివారం రాజులకండ్రిగకు చేరుకున్నారు. ఆశ్రమం వద్ద ప్రేమజంట వచ్చిన కారు ఉన్నట్లు గుర్తించారు. ఆశ్రమం నిర్వాహకుడిని ప్రభును విచారించారు. వారు ఇక్కడికి రాలేదని ప్రభు పోలీసులకు తెలిపాడు. దీంతో ప్రభును విచారణ నిమిత్తం తిరువళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు