వివాహేతర సంబంధం.. వాకిలి ఊడుస్తుండగా ఇంట్లోకి పిలిచి..

16 May, 2022 08:21 IST|Sakshi
శారద (ఫైల్‌)

చావలి (వేమూరు)గుంటూరు జిల్లా: ప్రియుడి చేతిలో గ్రామ వలంటీర్‌ దారుణ హత్యకు గురైన ఘటన గుంటూరు జిల్లా చావలి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చావలిలోని దళితవాడకు చెందిన దొప్పలపూడి శారద (25)కు అదే గ్రామానికి చెందిన మద్దా పద్మారావుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. శారద ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇంటి వాకిలి ఊడుస్తుండగా పద్మారావు ఆమెను ఇంట్లోకి పిలిచి కత్తితో మెడ కోశాడు.
చదవండి: నువ్వే లేకుంటే నేనెందుకని..

అనంతరం అదే కత్తితో గుండె పైనుంచి పొట్ట భాగం వరకు చీరేశాడు. ఆమె పొట్టలోంచి పేగులు బయటకు రాగా.. శారద రెండు చేతులతో వాటిని పట్టుకుని అరుస్తూ రోడ్డుపైకి వచ్చి పడిపోయింది. స్థానికులు 108కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ వచ్చే సమయానికి శారద మృతి చెందినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. హతురాలు చావలి గ్రామ సచివాలయం ఒకటో వార్డు వలంటీర్‌గా పని చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త  ధర్మారావు ఇంట్లోలేని సమయంలో ఈ ఘటన జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. పద్మారావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు