పాపం, పెళ్లి చేసుకోమని ఇంటికెళితే...

22 Nov, 2020 15:01 IST|Sakshi

ఏడేళ్ల ప్రేమ, ఇంటికెళితే యువతికి చేదు అనుభవం

సాక్షి, నిర్మల్: ఏడడుగులు వేస్తానని ఏడేళ్లు ప్రేమాయణం నడిపించిన ఓ ప్రబుద్ధుడు చివరికి మొహం చాటేశాడు. చెట్టాపట్టాలు వేసుకుని చెలిమి చేసి పెళ్లికి నిరాకరించాడు. తనకు అన్యాయం చేయొద్దని బాధితురాలు వారి ఇంటికి వెళితే అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ప్రియుడి బంధువులు ఆమెపై దాడికి దిగారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా మామడ మండలం కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. ప్రియుడు అడ్లూరి మనోజ్‌ తనను మోసం చేశాడని ప్రియురాలు అతని ఇంటి మందు ధర్నాకు దిగింది.
(చదవండి:సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ప్రేమ.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..)

ఏడేళ్లు ప్రేమ పేరుతో దగ్గరైన వ్యక్తి, పెళ్లికి ఒప్పుకోవడం లేదని తెలిపింది. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట మౌన దీక్ష చేసింది. దీంతో ప్రియుడి బంధువులు ఆ యువతిని చితకబాదారు. తీవ్రగాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రియుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనను యువతి కుటుంబ సభ్యులు, బంధువులు మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. న్యాయం కోసం తలుపు తడితే ఇంత కర్కషంగా ప్రవర్తిస్తారా అని యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం.
(చదవండి: హాట్‌ టాపిక్‌గా మారిన సివిల్స్‌ టాపర్స్‌ విడాకులు)

మరిన్ని వార్తలు