ప్రేయసి ఇంట్లో భోజనం: కొద్ది సేపటికే వాంతులతో ప్రియుడి మృతి

13 May, 2021 07:10 IST|Sakshi

టీ.నగర్‌: ప్రేమికురాలి ఇంటిలో భోజనం చేసిన యువకుడు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 17వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. కేరళ రాష్ట్రం, ఇడుక్కి జిల్లా, మూనారు ప్రాంతానికి చెందిన నిషాంత్‌ (30). ఇతను చెన్నైలోని ప్రైవేటు సంస్థలో పని చేస్తూ వచ్చా డు.

చెన్నై పళ్లికరనైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న అరియలూరు జిల్లా, గంగైకొండచోళపురం ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు సమ్మతం తెలిపారు. దీంతో ఈ నెల 17వ తేదీన వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఇదిలావుండగా కరోనా రెండో వైరస్‌ కారణంగా నిషాంత్‌ పని చేస్తున్న కార్యాలయానికి సెలవు ప్రకటించారు.

దీంతో చెన్నై నుంచి వివాహం నిశ్చయించబడిన వధువు ఇంటికి మంగళవారం నిషాంత్‌ చేరుకున్నాడు. అక్కడ అతనికి చేపల పులుసుతో భోజనం వడ్డించారు. దీన్ని తిన్న నిషాంత్‌ కొద్ది సేపటికే వాంతులు చేసుకోవడం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందాడు. నిషాంత్‌ తండ్రి ఫిర్యాదు మేరకు మీన్‌సురుట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: కరోనా సాయం కోసం ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు