పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట బలవన్మరణం

26 Apr, 2021 12:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బనశంకరి: కలిసి జీవించడానికి పెద్దలు అడ్డుపడ్డారన్న ఆవేదనతో ప్రేమ జంట తనువు చాలించింది. హావేరి తాలూకా నాగనూరు గ్రామానికి చెందిన విద్యాశ్రీ గాలి (22), ఇర్షాద్‌ కుడచి (23) ఆత్మహత్య చేసుకున్నారు. మూడేళ్లుగా వీరులో ప్రేమలో మునిగి తేలుతున్నారు.

విద్యాశ్రీ బీకాం చదువుతుండగా, ఇర్షాద్‌ కుడచి డిప్లొమా పూర్తిచేశాడు. ఇటీవల విద్యాశ్రీకి తల్లిదండ్రులు ఓ యువకునితో నిశ్చితార్థం చేశారు. ప్రేమకు దూరం కావడం ఎంతమాత్రం ఇష్టలేని విద్యాశ్రీ, ఇర్షాద్‌ కలిసి శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. దీంతో ఆ మహిళ..

మరిన్ని వార్తలు