గుడియాత్తంలో ప్రేమికుల ఆత్మహత్య?.. రీట ఇంటి సమీపంలో వ్యవసాయబావిలో

6 Sep, 2022 07:28 IST|Sakshi
అజిత్‌కుమార్‌(ఫైల్‌), రీట(ఫైల్‌) 

సాక్షి, చెన్నై: వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా నెల్లూరు జిల్లా పేటకు చెందిన వెంకటేశన్‌ కుమారుడు అజిత్‌కుమార్‌(26) పాల వ్యాపారం చేసేవాడు. ఆదివారం రాత్రి శెట్టికుప్పం కాలియమ్మన్‌ ఆలయం వెనుక ఉన్న నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అజిత్‌కుమార్‌ చెప్పులు, సెల్‌ఫోన్‌ కుంట సమీపంలో ఉండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇదే గ్రామానికి చెందిన పెరుమాల్‌ కుమార్తె రీట(22) కాట్పాడిలోని ఓ ప్రైవేటు టీచర్‌ ట్రైనింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నెల్లూరు పేట పంచాయతీ వార్డు సభ్యురాలిగా కూడా ఉంది.

ఇదిలా ఉండగా రాత్రి 2 గంటల సమయంలో రీట ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఒకే రోజు ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్‌)

మరిన్ని వార్తలు