ప్రతీకారమంటూ తల్లిదండ్రుల ఎదుటే బాలికపై..

7 Jul, 2021 18:24 IST|Sakshi

లక్నో: ప్రతీకారం తీర్చుకోవాలని ఓ బాలికను తన తల్లిదండ్రులు ముందే సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... అమ్రోహా రైల్వే స్టేషన్‌ సమీపంలో నివాసం ఉండే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, పొరుగింటి అమ్మాయి కలిసి జూన్‌ 27న ఊరి నుంచి వెళ్లిపోయారు. దీంతో జూన్‌ 29న వీరివురి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఈ ​క్రమంలో అమ్మాయి తరపున వాళ్లు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఓ ఇంటికి తీసుకెళ్లారు. 

తల్లిదండ్రుల ఎదుటే ఆ బాలికను
వారిద్దరు లేచిపోవడానికి ఆ బాలిక తన అన్నకు సహాయపడిందనే అనుమానంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. కనిపించకుండా పోయిన అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు దీనికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఆ బాలిక తల్లిదండ్రుల ఎదురుగానే ఆమెపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఓ నిందితుడు ఆ బాలిక ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాలను బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ ఆ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హెచ్చరించి విడిచిపెట్టారు. 

బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, తొలుత స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే తనపై జరిగిన దారుణాన్ని బాలిక వివరించడంతో ఆ 8 మందిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు