ఏడుగురి స్నేహితుల మధ్య ‘లూడో గేమ్‌’ వివాదం

5 Sep, 2021 19:10 IST|Sakshi

ఇద్దరు మధ్య డబ్బు విషయమై వివాదం

పరస్పరం దాడి.. ఒకరి మృతి

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ గేమ్‌ విషయంలో స్నేహితుల మధ్య వివాదం ఏర్పడింది. ఆ వివాదం కాస్త తీవ్ర దాడికి దారి తీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునేంత స్థాయికి చేరింది. ఒకరి ప్రాణం మీదకు వచ్చింది. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుత వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
చదవండి: మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం

పోలీసుల వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. గంగాబౌలి ప్రాంతానికి చెందిన మోహమ్మద్ అనీఫ్ (25), టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన రషీద్ (30), మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముస్తఫా (24)తో పాటు అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులతో లూడో గేమ్ గెలుపోటములపై వివాదం ఏర్పడింది. ఈ సమయంలో ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అప్పటికే వారందరూ మద్యంమత్తులో ఉన్నారు. ఒకరినొకరు దాడి చేసుకొని పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.
 
కొద్దిసేపటి తరువాత బయటికి వెళ్లివచ్చిన యువకులు మహమ్మద్ అనీఫ్‌పై తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో హనీఫ్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మహమ్మద్ ముస్తఫా (24), రషీద్ (30)లకు కత్తిపోట్లకు గురయ్యారు. అక్కడినుంచి బయటకు తప్పించుకుని పారిపోయారు. దీంతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భయాందోళనతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని హనీఫ్‌, మరో ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ముస్తఫా, రషీద్ కోలుకుంటున్నారని మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్ రణీశ్వర్‌రెడ్డి తెలిపారు. పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హనీఫ్‌, హాజీ స్నేహితులు. వీరిద్దరూ లూడో గేమ్‌ ఆడుతుంటారు. అయితే డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య డబ్బు విషయమై గొడవ ఏర్పడింది. పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే తీవ్ర గాయాలపాలైన హనీఫ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. హాజీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మంగళ్‌హాట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్‌ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక

మరిన్ని వార్తలు