పోలీసు కస్టడీలో మృతి?

19 Apr, 2021 14:47 IST|Sakshi

టీ.నగర్‌: పోలీసు కస్టడీలో వ్యక్తి మృతి వ్యవహారంపై తిరుమంగళం అమముక అభ్యర్థి ఆదినారాయణన్‌ సహా నలుగురు మదురై హైకోర్టు బెంచ్‌ ఎదుట హాజరయ్యారు. మదురై సోలైయళగుపురం ముత్తుకరుప్పన్‌ కుమారుడు డ్రైవర్‌ బాలమురుగన్‌. అతన్ని ఒక కిడ్నాప్‌ కేసులో అవనియాపురం పోలీసులు 2019లో చట్టవిరుద్ధంగా పోలీసు స్టేషన్‌లో ఉంచి దాడి చేశారు. దీంతో అతను మృతిచెందినట్లు వార్తలు వ్యాపించాయి. 
ఈ కేసుపై శనివారం విచారణ జరిగింది. న్యాయమూర్తులు టీఎస్‌ శివజ్ఞానం, ఎస్‌ ఆనంద్‌ విచారణ జరిపారు. పోలీసుల దాడిలో బాలమురుగ న్‌ మృతిచెందలేదని, ప్రమాదంలో గాయపడి మృతిచెందినట్లు తెలిసింది. ఈ కేసులో ఆదినారాయణన్‌ సహా నలుగురు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. దీనిపై జూన్‌ 14న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. 

లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష 
తిరువొత్తియూరు: ఈరోడ్‌ జిల్లాలో చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ రోడ్డు మహిళా కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఈరోడ్‌ జిల్లా భవానిసాగర్‌ తాండం పాళయానికి చెందిన జగన్‌ (19) అదే ప్రాంతంలో ఉంటున్న నాలుగేళ్ల బాలికపై 2019లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ శనివారం ఈరోడ్‌ మహిళా కోర్టులో జరిగింది. విచారణ అనంతరం జగన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు చెప్పారు.

హత్య కేసులో యవజ్జీవం 
బాంబుతో దాడి చేసి రైతును హత్య చేసిన యువకుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. శివగంగై జిల్లా తిరుప్పాచ్చికి చెందిన ముత్తు రామలింగం (35) రైతు. ఇతనికి దూతైకి చెందిన పెరియస్వామికి వైగై నదిలో ఇసుక తరలింపులో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. 2003 అక్టోబర్‌ 3న బాంబు దాడిలో ముత్తు రామలింగం మృతి చెందాడు. పోలీసులు సేంగైస్వామిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి శివగంగై జిల్లా సెషన్స్‌ కోర్టులో శనివారం న్యాయమూర్తి సుమతీ సాయి ప్రియ సమక్షంలో జరిగింది. సేంగైస్వామికి యావజ్జీవ శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

>
మరిన్ని వార్తలు