మద్యం మత్తులో పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టాడు

27 Sep, 2021 10:53 IST|Sakshi

సాక్షి,అలంపూర్‌( మహబూబ్‌నగర్‌): మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌  నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగి ముప్పతిప్పలు పెట్టాడు. ఎస్‌ఐ లెనిన్‌ తెలిపిన వివరాలిలా.. ఆదివారం కర్నూల్‌కు చెందిన కొందరు యువకులు రాజోళిలో బహిరంగంగా మద్యం తాగుతున్నారని సమాచారం అందగా పోలీసులు అక్కడికి వెళ్లారు. గమనించిన కొందరు యువకులు పరారు కాగా మరో యువకుడు లక్ష్మణ్‌ మాత్రం మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

ఈ క్రమంలోనే పోలీసు వాహనం వెనక అద్దాలపై దాడి చేయగా అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎట్టకేలకు యువకుడిని స్టేషన్‌కు తరలించారు. కర్నూల్‌ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నించగా ఆత్మహత్య చేసుకోవడానికి అని సమాధానం ఇవ్వడంతోపాటు పోలీసులపై ఓ క్రమంలో దాడి చేసేందుకు యత్నించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

చదవండి: మమ్మల్ని క్షమించండి.. మీకు భారం కాకూడదనే..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు