భర్త వేధింపులతో ఒకరు.. పెళ్లికి యువకుడు నిరాకరించాడని మరొకరు

23 Aug, 2022 20:39 IST|Sakshi
సుజాత, నాగరత్నమ్మ( ఫైల్‌)

సాక్షి, మహబూబ్‌నగర్‌: మండలంలోని తాళ్లనర్సింహాపురం గ్రామానికి చెందిన దుబ్బల సుజాత(30) భర్త వేధింపులు భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ బాలవెంకటరమణ కథనం ప్రకారం.. ఈ నెల 13న రాత్రి భర్త క్రాంతికుమార్‌ సుజాతను కొట్టడంతో ఆమె తన తల్లి అలివేలమ్మకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో ఆమె వచ్చి అల్లుడికి నచ్చజెప్పి వెళ్లింది. మళ్లీ 16న రాత్రి భర్త మరోసారి కొట్టడంతో మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వెంటనే తల్లి, బంధువులు నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. సుజాత కొల్లాపూర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తుండగా.. క్రాంతికుమార్‌ పెంట్లవెల్లిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై సుజాత అన్న సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 
చదవండి: భర్త ఆగడాలు తట్టుకోలేక.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య 

వెల్దండ: ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్‌ఐ నర్సింహులు కతనం ప్రకారం.. వెల్దండలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరత్నమ్మ(24) ఆమనగల్‌ మండలానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 20న పురుగు మందు తాగింది.

వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనపై నాగరత్నమ్మ అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు