చీర కట్టుకోవడం రాదని.. లెటర్‌ రాసి భర్త ఆత్మహత్య

17 May, 2022 18:38 IST|Sakshi

సాక్షి ముంబై: ఇటీవల వింటున్న ఆత్మహత్యలు చూస్తే చాలా సిల్లీగా, కామెడిగా కనిపిస్తున్నాయి. ఆ కారణాలను వింటుంటే చిర్రెత్తుకొచ్చేలా ఉంటున్నాయి. మరీ అర్థంపర్థ లేని చిన్న చిన్న కష్టాలకు ఆత్మహత్యలకు వెళ్లిపోతున్నారు. చిన్నపిలలు దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకెళ్తే... మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో 24 ఏళ్ల వ్యక్తి ఆరునెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఆ మహిళ అతని కంటే ఆరేళ్లు పెద్దది. కానీ ఆమెకు చీర కట్టుకోవడం, మాట్లాడటం, నడవటం సరిగా రాదు. దీంతో అసంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పైగా సూసైడ్‌ నోట్‌లో తన భార్యకు చీరకట్టుకోవడం రాదనే చనిపోతున్నానని పేర్కొనడం గమనార్హం. ఈ  మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: సార్‌ అర్జంట్‌ ఒక ఫోన్‌ కాల్‌’.. ఫోన్‌ దొంగ వెంటపడి రైలు కింద నుజ్జయిన పెద్దాయన
 

మరిన్ని వార్తలు