మహేష్‌ బ్యాంక్‌ కేసులో ‘ఖరీదైన దర్యాప్తు’

31 Mar, 2022 08:13 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌: ఏపీ మహేష్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో చోటు చేసుకున్న సైబర్‌ నేరం రెండు రకాలుగా రికార్డు సృష్టించింది. ఈ స్కామ్‌లో సైబర్‌ నేరగాళ్లు మొత్తం రూ.12,48,21,735 కాజేశారు. దీని దర్యాప్తు కోసం నగర పోలీసు విభాగం రూ.58 లక్షలు ఖర్చు చేసింది. ఇంత మొత్తం నగదుతో ముడిపడి ఉన్న సైబర్‌ నేరం నమోదు కావడం, ఓ కేసు దర్యాప్తు కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం కూడా నగర కమిషనరేట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

ఈ కేసును సవాల్‌గా తీసుకున్నామని, సైబర్‌ క్రైమ్, సీసీఎస్‌ విభాగాలకు చెందిన 100 మంది అధికారులు, సిబ్బందిని వినియోగించామని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ బుధవారం నాటి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెండు నెలల పాటు శ్రమించి, ఈ దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులకు ఆయన రివార్డులు అందించారు.  

ఆ మూడు ఖాతాలు సిద్ధం చేసినా... 
సైబర్‌ నేరగాళ్లు షానాజ్‌ బేగంతో పాటు శాన్విక ఎంటర్‌ప్రైజెస్, హిందుస్తాన్‌ ట్రేడర్స్, ఫార్మాహౌస్‌ ఖాతాలతో పాటు కటకం కోటేశ్వర్, ప్రియాంక ఎంటర్‌ ప్రైజెస్, ఫాతిమా మాత సెక్యూర్‌ వెల్డింగ్‌ సంస్థల ఖాతాలు సిద్ధం చేసి ఉంచారు. అయితే ఆఖరి మూడు ఖాతాల్లోకి నగదు పడలేదు. రెండు సంస్థల నిర్వాహకులను గుర్తించి, కొందరిని పట్టుకున్నారు. జగద్గిరిగుట్ట చిరునామాతో ఉన్న ఫాతిమా మాత సెక్యూర్‌ వెల్డింగ్‌ సంస్థ బోగస్‌గా తేలింది.  

బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రమాదంలో ఉంది
ఈ నేరం చేయడానికి ప్రధాన హ్యాకర్లు వినియోగించిన ఐపీ అడ్రస్‌లు అమెరికా, కెనడా, లండన్, రోమేనియాలవిగా కనిపిస్తోంది. అ యితే వాళ్లు ఫ్రాక్సీ సర్వర్లు వాడటంతో ఇవి ఎంత వరకు వాస్తమే ఇప్పుడే చెప్పలేం. ఈ హ్యాకర్లే గతేడాది నగరంలోని తెలంగాణ కో–ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ నుంచి రూ.1.98 కోట్లు కాజేసిందీ వీళ్లేనని అనుమానిస్తున్నాం.

ఇతర నగరాలు, దేశాల్లోనూ ఇ లాంటి నేరాలు జరిగాయి... భవిష్యత్తులో మ రిన్ని జరిగే ప్రమాదమూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్ర మాదంలో ఉన్నట్లు గుర్తించాలి. బ్యాంకుల సైబర్‌ సెక్యూరిటీ సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు సూచలను చేసినా వాటి అమలు పర్యవేక్షణ జరగట్లేదు. త్వరలోనే రిజ ర్వ్‌ బ్యాంక్‌ ద్వారా బ్యాంకుల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తాం.  
– సీవీ ఆనంద్, నగర కొత్వాల్‌   

(చదవండి: విమానంలో చిక్కిన చైన్‌ స్నాచర్‌)

మరిన్ని వార్తలు