స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు..

4 Mar, 2021 08:30 IST|Sakshi

యువతి అదృశ్యం

మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఏఎస్‌ఐ క్రిష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరి భవానీనగర్‌కు చెందిన మేఘనాథ్‌ కూతురు సుమిత (20) ప్రైవేట్‌ ఉద్యోగి. తరచూ హబ్సిగూడలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తూవుండేది. ఆమెతో తరచూ వీడియోకాల్‌ మాట్లాడుతుండడంతో తల్లి మందలించింది.ఈ నెల 1 వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన సుమిత తిరిగిరాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బిల్‌ కలెక్టర్‌ను బెదిరించిన కేసులో.. ఏడాది జైలు 
నేరేడ్‌మెట్‌: విద్యుత్‌ బిల్లు చెల్లించమని అడిగిన బిల్‌ కలెక్టర్‌ను కత్తితో బెదిరించిన కేసులో నిందితుడికి మల్కాజిగిరి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్టు బుధవారం నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహస్వామి పేర్కొన్నారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....పోలీసుస్టేషన్‌ పరిధిలోని సంతోషిమానగర్‌లో నివాసం ఉంటున్న శంకర్‌రాయ్‌ ఇంటికి 2018 సంవత్సరం సెపె్టంబర్‌ 29న బిల్‌ కలెక్టర్‌ శ్రీశైలం పెండింగ్‌ విద్యుత్‌ బిల్లు వసూలు కోసం వెళ్లాడు. బిల్లు చెల్లించాలని కోరగా నిందితుడు కత్తితో బెదిరించాడు.

ఈ విషయాన్ని వెంటనే బిల్‌ కలెక్టర్‌ ఏఈ రవీందర్‌కు సమాచారం ఇచ్చాడు. ఏఈ వచ్చి బిల్లు చెల్లించాలని లేనిపక్షంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేయగా, నిందితుడు  ఆయన్ని బెదిరించాడు. ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిïÙటు దాఖలు చేశారు. బుధవారం తుది విచారణ పూర్తి కావడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ వివరించారు.    

మరిన్ని వార్తలు