Gunpoint: విద్యార్థిని కిడ్నాప్‌... రూ.20 లక్షలు డిమాండ్‌ చేసి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ

8 Feb, 2022 16:56 IST|Sakshi

న్యూఢిల్లీ: కొన్ని నేరాలు చూస్తే ఎవర్ని నమ్మాలి అనే సందేహం కలుగుతుంది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు తమ బంధువులు లేదా పరిచయమున్న వ్యక్తుల చేతిలోనే మోసపోవడం లేదా వేధింపులకు గురవడం వంటివి జరుగుతుండటం బాధకరం. అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీలో ఎంబీఏ విద్యార్థి ఫినైల్‌ సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..."ఆ ఎంబీఏ విద్యార్థితో ఒక నిందితుడు పథకంలో భాగంగా సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ నిందితుడు అతన్ని అక్టోబర్‌ 23, 2020న కిడ్నాప్‌ చేసి గదికి తీసుకెళ్లారు. అంతేకాదు తుపాకీ వీడియోతో నగ్న వీడియోల తోపాటు తుపాకీ, గంజాయి, పిస్టల్‌ని పట్టుకుని ఉన్న వీడియోలను కూడా తీశారు.

ఈ మేరకు ఆ నిందుతుడు తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ ఆ విద్యార్థిని బెదిరించి రూ. 20 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబం రూ.5 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఆ నిందితుడి ఆ విద్యార్థి నగ్న వీడియోలను అతని కాలనీలోని వాళ్లకు, బంధువులకు పంపిచాడు. మళ్లీ ఫిబ్రవరి 1న ఫోన్‌ చేసి డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం మొదలు పెట్టాడు.

ఇక ఆ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ధర్మపాల్‌ అనే కానిస్టేబుల్‌ కూడా ఆ విద్యార్థిని బెదిరించడం ‌మొదలు పెట్టాడు. దీంతో ఆ విద్యార్థి మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఫినైల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు." అని పోలీసులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు ప్రధాన కారకుడైన నిందుతుడిని అరెస్టు చేయడమే కాక ఇతర నిందుతుల ఆచూకి కోసం విచారించడం ప్రారంభించారు. అంతేగాక ఆ విద్యార్థి కుటుంబాన్ని కలిసి నిందుతులు పట్టుకుని అరెస్ట్‌ చేయడమే కాక సదరు కానిస్టేబుల్‌ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

(చదవండి: హెల్మెట్‌ ధరించమని అన్నందుకే దారుణంగా కొట్టి, జీప్‌ ఎక్కించి....)

మరిన్ని వార్తలు