పిల్లల ముందే భార్య పై అఘాయిత్యం... గొంతు కోసి, బాయిల్‌ చేసి...

14 Jul, 2022 20:31 IST|Sakshi

మహిళల పై జరుగుతున్న ఘోరాలకు అంతేలేదు. పిల్లల తల్లి అని కనికరం కూడా లేకుండా పోతోంది. అదీ కూడా స్వయంగా భర్తలే భార్యలపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతుండటం బాధకరం. కలిసి ఉండటం ఇష్టం లేనప్పుడు ఆమెను తన మానన తనని బతకనవ్వకుండా హతమార్చి ఇరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో వారికి పుట్టిన పిలలు అనాథలుగా మారిపోతున్నారు. ఇక్కడొక వ్యక్తి అచ్చం అలాంటి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం పాకిస్తాన్‌లో సింథ్‌ ప్రావిన్స్‌కి చెందిన ఆషిక్‌ అనే వ్యక్తి ఒక ప్రైవేట్‌ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతను తన ఆరుగురి పిల్లల ముందే తన భార్య గొతుకోసి.. ఒక పెద్ద పాత్రలో వేసి బాయిల్‌ చేసి చంపాడు. ఈ దారుణ ఘటన తర్వాత ఆశిష్‌ తన ముగ్గురు పిల్లలను తీసుకుని పారిపోయాడు. ఐతే బాధితురాలి 15 ఏళ్ల కుమార్తె పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది.

ఈ ఘటన పోలీసులను సైతం కదిలించింది.  ఈ మేరకు  గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని వంటగదిలో బాధితురాలు నర్గీస్‌ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. విచారణలో ఆశిష్‌ తన భార్యను బాయిల్‌ చేయడానికి ముందే గొతు కొసి చంపినట్లు తేలిందని చెప్పారు. అతను తన భార్యను అక్రమ సంబంధాలు పెట్టుకోమని బలవంతం చేశాడని, ఆమె అందుకు నిరాకరించడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఊహాగానాలు వెలువెత్తాయి. కానీ కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మిగిలిన ముగ్గురు పిల్లలు సంరక్షణ బాధ్యతలను పోలీసులు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

(చదవండి: టులెట్‌ బోర్డు.. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండడంతో..)

మరిన్ని వార్తలు