దారుణం: 51 ఏళ్ళ వ్యక్తి..100 మంది మహిళలను వేధించాడు!

14 Mar, 2021 15:30 IST|Sakshi

లక్నో​: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకొంది. మహిళలను, బాలికలనే టార్గెట్‌గా చేసుకొని లైంగికంగా వేధిస్తున్నఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూపీలోని ఔరియా జిల్లాకు చెందిన  51 ఏళ్ళ రాజేష్‌ మహిళలను లైంగికంగా వేధించేవాడు. ఇప్పటి వరకు దాదాపు 100 మంది మహిళలు ఇతని బారిన పడ్డారని లక్నో పోలీసుల విచారణలో బయటపడింది. ఈమేరకు నిందితుడు రాజేష్‌ను ఔరియా పోలీసులు అరెస్టు చేశారు. ఇతని దగ్గర నుంచి రెండు ఫోన్‌లు, సిమ్‌ కార్డ్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు సంచలనాత్మక విషయాలను రాబట్టారు. కాగా, ఇతనికి 200 మంది మహిళలతో పరిచయాలున్నట్లు పోలీసుల విచారణలో రాజేష్‌ తెలిపాడు.  

మొదట బాలికలు, మహిళలతో పరిచయం పెంచుకొని ఆతర్వాత వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతటితో ఆగకుండా వీరికి అశ్లీలఫోటోలు, మెస్సెజ్‌లను పంపి పైశాచికానందం పొందేవాడు. కాగా, ఇతనిపై యూపీ వ్యాప్తంగా 66 కేసులు నమోదయ్యాయని ఔరియా పోలీసు అధికారి అపర్ణ గౌతమ్ ‌పోలీసులు తెలిపారు. ఇతనిపై తొలి వేధింపులు కేసు 2018లోను వెలుగులోకి వచ్చిందని..అయితే అప్పట్లో కేసు నమోదు చేసుకున్నలక్నో ఉమెన్ ‌పవర్‌లైన్‌ పోలీసులు, నిందితుడికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినప్పటికి రాజేష్‌ తీరుమార్చుకోలేదు. కాగా, నిందితుడిపై  పోక్సోచట్టం, పలు సెక్షన్‌ల కింద కేసులను నమోదు చేసుకున్న లక్నోపోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

చదవండి: నగ్నంగా కవ్వించి...ఆపై రికార్డు చేసి 

మరిన్ని వార్తలు