భార్యభర్తలపై పెట్రోల్‌ దాడి..చనిపోకపోతే మరోసారి చంపేవాడిని

15 Nov, 2022 10:17 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: భార్య, భర్త, పది నెలల చిన్నారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఇద్దరి మృతికి కారకుడైన నాగుల సాయి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆదివారం రాత్రి నిందితుడిని అరెస్ట్‌ చేసిన నారాయణగూడ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలను రాబట్టారు. ఈనెల 7న రాత్రి బాటిల్లో పెట్రోల్‌ తీసుకువచ్చిన నాగుల సాయి నారాయాణగూడ ఎక్స్‌రోడ్స్‌ వద్ద దానిని జగ్గులో పోసుకున్నాడు. అనంతరం సమీపంలో పూలు అమ్ముతున్న ఆర్తీ, ఆమె పక్కనే ఉన్న నాగరాజులపై చల్లి నిప్పంటించాడు.

అక్కడి నుంచి బర్కత్‌పురా వైపు పరిగెత్తిన అతను బర్కత్‌పురా వద్ద సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సు ఎక్కి ఆ రోజు రాత్రి సికింద్రాబాద్‌లో తలదాచుకున్నాడు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో  నల్లగొండ మీదుగా వెళ్లే రైలు ఎక్కి నల్లగొండ చేరుకున్నాడు. అప్పటి నుంచి అక్కడే రోడ్డుపై చిత్తు కాగితాలు ఏరుకుని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఆదివారం ఉదయం నాగులసాయి తన స్నేహితుడికి ఫోన్‌ చేసి ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నాడు. సదరు స్నేహితుడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ల్లగొండకు చేరుకున్న పోలీసులు ఆదివారం రాత్రి అతడిని ఆదుపులోకి తీసుకుని నారాయణగూడకు తరలించారు.  

కోర్టు ధిక్కారం కేసులో ఏడాది జైలు 
రెండేళ్ల క్రితం నాగులసాయి అతని బామ్మరిది జితేంద్రను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో మూడు నెలల పాటు జైలు పాలయ్యాడు. జైలు నుంచి బయటికి వచి్చన తర్వాత విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం అతడికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. సోమవారం చేసిన దాడిలో ఆర్తీ, ఆమె భర్త నాగరాజు చనిపోకపోతే మరోసారి వారిని చంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులతో పేర్కొన్నాడు. మంగళవారం నాగుల సాయిని రిమాండ్‌కు పంపనున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.  

(చదవండి: మొదటి భర్త ఘాతుకం...తనని కాదని మరో పెళ్లి చేసుకుందని పెట్రోల్‌తో...)

మరిన్ని వార్తలు