కసాయి కొడుకు... కన్న తల్లిదండ్రులనే చంపేందుకు యత్నం

7 Oct, 2022 20:33 IST|Sakshi

న్యూఢిల్లీ: 34 ఏళ్ల వ్యక్తి కనిపెంచిన తల్లిదండ్రులనే హతమార్చేందుకు యత్నించాడు. ఈఘటన ఢిల్లీలోని ఫతే నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారని కన్నతల్లిందండ్రులనే కడతేర్చేందుకు యత్నించాడు వారి సుపుత్రుడు. ఈ ఘటనలో నిందితుడి తండ్రి స్వర్నజిత్‌సింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు.

తల్లి అజిందర్‌ కౌర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, కానీ ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని  డిప్యూటీ కమిషనర్‌ ఘనాశ్యామ్‌ బన్సాల్‌ తెలిపారు. గాయపడిన బాధితులను హుటాహుటినా దీన్‌దయాళ్‌ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఐతే నిందుతుడు దాదాపు రూ. 7 లక్షలు వరకు స్టాక్‌ మార్కెట్‌లో పోగొట్టుకున్నట్లు చెప్పారు. దీంతో తన తల్లిదండ్రులు డబ్బులు అడిగాడని, ఐతే వారు ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో హతమార్చేందుకు యత్నించాడని వెల్లడించారు. 

(చదవండి: కొడుకుతో విడాకులకు కోడలు ప్లాన్‌? వెంటపడి మరీ ప్రాణాలు తీసిన మామ)


 

మరిన్ని వార్తలు