సినిమాలో ఆఫర్‌ కోసం.. గొంతుకోసుకుని

25 Apr, 2021 06:56 IST|Sakshi

తిరువళ్లూరు: సినిమాలో ఆవకాశం కోసం గొంతుకోసుకుని సంబంధిత వీడియోను తమ్ముడికి వాట్సాప్‌ చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసారు. కాంచీపురం జిల్లా సుంగువాసత్రం సంతవేలూరు గ్రామానికి చెందిన శంకరలింగం కుమారుడు మారిముత్తు. ఇతను తిరువళ్లూరు జిల్లా ఉలుందైలోని ప్రయివేటు కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు.

ఆరు నెలల క్రితం తిరువళ్లూరు జిల్లా కాకలూరు ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం వుంటున్నాడు. ఇతని తమ్ముడు చెన్నైలో వుంటూ సినిమా ఆఫర్ల కోసం యత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం యథావిదిగా ఆఫీస్‌కు వెళ్లిన మారిముత్తు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చి నిద్రకు ఉపక్రమించాడు. అయితే శనివారం ఉదయం 10 గంటలూ దాటుతున్నా మారిముత్తు బయటకు రాకపోవడంతో పాటు ఇంటి నుంచి రక్తం వాసన రావడంతో స్థానికులు తిరువళ్లూరు తాలుకా పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో మారిమత్తు రక్తపుమడుగులో పడివుండడంతో అతడిని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. పోలీసుల విచారణలో కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే సినిమాలో అవకాశం పొందవచ్చని తమ్ముడు సూచన మేరకు ప్రాణం పోకుండా గొంతుకోసుకుని రక్తం కారుతూ వున్న వీడియోను తీసి తమ్ముడికి పంపించి సోషల్‌మీడియాలో పోస్టు చేసినట్టు వివరించారు.
చదవండి: కారులో నగ్నంగా వీడియో తీసి వేధిస్తున్నాడు! 

మరిన్ని వార్తలు