మహిళతో రెడ్‌ హ్యండెడ్‌గా దొరికాడు.. భార్య నగలన్నీ ఆమెకు

4 Mar, 2021 17:22 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: భార్య ఉండగానే వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ భర్త. అంతటితో ఆగకుండా భార్య బంగారు నగలన్ని సదరు మహిళకు ఇవ్వడం మొదలుపెట్టాడు. భర్త ప్రవర్తనపై అనుమానం కలిగిన భార్య అతను ఎక్కడి వెళ్లుతున్నాడే తెలుసుకునేందుకు ప్రయత్నించగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని మేదర బస్తీలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజుకు అదే ఏరియాకు చెందిన కృష్ణ వేణికి 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం గాజులరాజం బస్తీకి చెందిన మరో మహిళతో రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య బంగారు నగలను సైతం సదరు మహిళకు ఇచ్చాడు. అయితే భార్యకు మాత్రం అవసరాల నిమిత్తం డబ్బులు కావల్సి ఉండి బ్యాంక్ లో బంగారం పెట్టి డబ్బులు తీసుకోవాలని నమ్మించాడు. దీంతో భార్యకు కూడ అనుమానం రాలేదు.

అయితే ఇటివలే భార్త కదలికలపై అనుమానం రావడంతో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లుతున్నానని చెప్పిన భర్తను ఆమె అనుసరించింది. కోద్ది దూరంలో ఉన్న కాలనీకి చెందిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్లడాన్ని భార్య కృష్ణవేణి గమనించింది. భార్యకు రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోవడంతో కృష్ణవేణి బంధువులు ఇద్దరిని చితకబాదారు. ఇంట్లో గోడవలు జరిగాయని, తన భార్యను విడిపెడుతున్నాని చెప్పి తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సదరు మహిళ చెప్పింది. సమాచారం అందుకున్న పోలిసులు రంగంలోకి దిగి భర్తను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను పోలిస్ స్టేషస్‌ తీసుకువెళ్లారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

చదవండి: అయ్యో తల్లి.. నీకెంతటి కష్టం వచ్చింది

మరిన్ని వార్తలు