ఆన్‌లైన్‌లో ‘సుపారీ ఇస్తానన్న’ వ్యక్తి అరెస్టు 

3 Jun, 2022 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మను హత్యచేస్తే రూ.కోటి ఇస్తానంటూ సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన వ్యక్తిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొఘల్‌పురకు చెందిన ఖవి అబ్బాసీ ఏఐఎంఐఎం (ఇంకిలాబ్‌) పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఓ మతానికి వ్యతిరేకంగా నుపూర్‌ శర్మ మాట్లాడారనే ఉద్దేశంతో ఖవి సోషల్‌ మీడియాలో ఆయన్ను చంపితే నజరానా ఇస్తానంటూ ప్రకటించారు. ఈ అంశంపై ఫిర్యాదులు అందడంతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

(చదవండి: బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?)

మరిన్ని వార్తలు