Bengaluru: ఇంటికి పిలిపించి.. భార్య ప్రియుడిని హత్య చేయించిన భర్త

1 Dec, 2022 10:01 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బెంగళూరు: సుపారీ ఇచ్చి భార్య ప్రియుడిని హత్య చేయించిన భర్త, అతనికి సహకరించిన మరో ముగ్గురిని యడ్రామి పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ ఇషాపంత్‌ తెలిపినమేరకు వివరాలు.. యాదగిరి జిల్లా  సిద్దాపుర గ్రామానికి చెందిన రెహమాన్‌ షాబుద్దీన్‌ కౌతాళ్‌ భార్యతో సురపురకు చెందిన చాంద్‌పాషా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పలు పర్యాయాలు రెహమాన్‌ హెచ్చరించినా ఫలితం లేకపోయింది. దీంతో చాంద్‌పాషాను హత్యను చేసేందుకు  ప్రభుగౌడ బిరాదార్‌ (22), హుణసగి తాలూకా దేవత్కల్‌ గ్రామానికి చెందిన మల్లికార్జున లక్మాపుర్‌ (21)కు రెహమాన్‌ రూ.60వేలు చొప్పున సుపారీ ఇచ్చాడు.

సెప్టెంబర్‌ 4న ప్రభుగౌడ.. చాంద్‌పాషాను కరెంటు పనుల కోసం అంటూ తన ఇంటికి పిలిపించి కట్టెలతో దాడి చేశాడు అప్పటికే అక్కడకు చేరుకున్న మరో నిందితుడు సయ్యద్‌ షాబుద్దీన్‌ కౌతాళ్‌తో కలిసి చాంద్‌పాషాను కారులో యాదగిరి జిల్లా కుడేకల్‌ కాలువ వద్దకు తీసుకెళ్లి చేతులు కాళ్లు కట్టివేసి నీటిలో పడేశారు. సెప్టెంబర్‌ 10న  మృతదేహం నీటిపై తేలియాడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేశారు.  

చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. ఆనందానికి అడ్డుగా ఉన్నాడని..)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు