మాయమాటలతో బాలికను లొంగదీసుకుని..

12 Jun, 2021 08:16 IST|Sakshi

బాలికపై లైంగిక దాడి 

మొవ్వ(పామర్రు)/కృష్ణా జిల్లా: బాలికపై లైంగిక దాడి చేసి, వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు కూచిపూడి ఎస్‌ఐ జీ సత్యనారాయణ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు మొవ్వ మండలం నిడుమోలు బ్రాహ్మణ చెరువు సమీపంలోని ఎస్టీ కాలనీకి చెందిన 17 సంవత్సరాల బాలికను అదే కాలనీకి చెందిన కోట దుర్గారావు(20) మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. బాలిక గర్భవతిని చేసి ప్లేటు ఫిరాయించాడు. భాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. మోసం చేసిన వ్యక్తికి గతంలో పెళ్లి కాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుని అవనిగడ్డ డీఎస్పీ మెహబూబ్‌ బాషా దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: విషాదం: కన్నీరే మిగిలిందిక నేస్తం!   
రూ.7 కోట్లకు రియల్‌ బురిడీ!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు