ఉద్యోగాన్ని ఊడదీశారు!

4 Mar, 2021 08:53 IST|Sakshi

కోరుట్ల: తప్పుడు ధ్రువపత్రాలతో ఆర్టీసీలో కాంట్రాక్ట్‌ కండక్టర్‌ ఉద్యోగం పొందాడు  కరీంనగర్‌ జిల్లాకు చెందిన సతీశ్‌. కాగా, ఇతను  కేశవపట్నానికి చెందిన వాడుగా గుర్తించారు. ఇతని సర్టిఫికేట్‌లు నకిలీవన రుజువుకావడంతో కోరుట్ల కోర్టు జడ్జి శ్యాంకుమార్‌ మూడేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. కాగా, 2011లో కాంట్రాక్ట్‌ కండక్టర్‌ పోస్టులకు గాను సతీశ్‌ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కోరుట్ల డిపోలో ఉద్యోగం పొందాడు.

గతంలోనే..దీనిపై కరీంనగర్‌ ఆర్‌ఎం మునేశ్వర్‌ కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీపీ కట్కం రాజేంద్రప్రసాద్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ అనంతరం సతీశ్‌కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని అధికారులు పేర్కొన్నారు.  

చదవండి: ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్‌

మరిన్ని వార్తలు