ఫేస్‌బుక్‌లో ఓటింగ్‌ వీడియో ఆప్‌లోడ్‌ చేయడంతో..

8 Apr, 2021 07:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: తమిళనాడులోని గోబిచెట్టిపాళయంలో ఓటేయడాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్టుచేశాడు. రాష్ట్రంలో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్‌ బూత్‌లోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లేందుకు ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించింది. దీంతో పోలింగ్‌ బూత్‌ ముందు భద్రతా పనుల్లో ఉన్న పోలీసులు ఓటర్లతో సెల్‌ఫోన్లు తీసుకువెళ్లరాదంటూ హెచ్చరికలు చేశారు.

ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను లెక్కచేయకుండా గోబిచెట్టిపాళయంకు చెందిన ఓ యువకుడు సెల్‌ఫోన్‌తో వెళ్లి తాను ఓటేయడాన్ని వీడియో తీశాడు. అనంతరం తాను తీసిన వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు