ఆనందయ్య మందు పేరుతో అమ్మకాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

14 Jun, 2021 04:56 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగదు, మందు ప్యాకెట్లు

రూ.1.50 లక్షలు, 150 ప్యాకెట్ల మందు స్వాధీనం

తాడికొండ: ఆనందయ్య కరోనా మందు పేరుతో అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.1.50 లక్షలు, 150 ప్యాకెట్ల మందును స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ ఎస్‌ఐ బి.వెంకటాద్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో కరోనా మందు పేరిట అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం గ్రామంలో సోదాలు నిర్వహించారు.

గ్రామానికి చెందిన అన్నే కాంతారావు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని సోదా చేయగా అతని వద్ద ఉన్న సంచిలో కరోనా మందు పేరిట అమ్ముతున్న 150 ప్యాకెట్లు కనిపించాయి. విచారణలో గత 10 రోజులుగా గ్రామస్తులకు 750 ప్యాకెట్లను.. ఒక్కో ప్యాకెట్‌ రూ.200కు అమ్మినట్టు చెప్పాడు. అమ్మిన ప్యాకెట్ల తాలూకు రూ.1.50 లక్షలతో పాటు మిగతా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు