పైశాచికత్వం: యువతుల లోదుస్తులు కాజేసి..

27 Jul, 2020 10:56 IST|Sakshi

భోపాల్‌ : బాలికల హాస్టళ్లలోకి ప్రవేశించి వారి లోదుస్తులు కాజేసి పైశాచిక ఆనందం పొందుతున్న ఓ దొంగను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.  ఈ ఘటన మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇండోర్‌ ప్రాంతంలోని లేడీస్‌ హాస్టల్స్‌, అమ్మాయిలు అద్దెకు ఉండే నివాసాల్లో గత కొన్ని రోజులుగా లోదుస్తులు మాయం అవుతున్నాయి. అయితే ఈ ఘటనలు రాత్రి వేళల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఇటీవల లోదుస్తుల చోరీలు అధికమవుతున్న నేపథ్యంలో బాధిత మహిళలు విజయ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శ్రీకాంత్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో లోదుస్తులు, బట్టలను దొంగిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అంతేగాక వాటిని చింపేస్తున్నది కూడా తానేనని ఒప్పుకున్నాడు. (బాలికను బలవంతపు పెళ్లి చేసుకున్న విద్యార్ధి)

కాగా ఏడాది క్రితం కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకోగా, ఆ కేసులో కూడా ఇతడే నిందితుడని తేలడంతో నిందితుడిని జైలుకు తరలించారు.ఈ విషయంపై విజయ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇంచార్జి తెమజీబ్‌ ఖాజీ మాట్లాడుతూ.. తమకు లేడీస్‌ హాస్టల్స్‌ నుంచి లోదుస్తులు మాయమవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుల సహాయంతో పోలీసు బృందాలను రాత్రి సమయాల్లో  బాలికలు నివసించే హాస్టళ్ల ప్రాంతంలో మోహరించామని తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. (ప్రేమ కథ: యువతి ఆత్మహత్య, యువకుడు హత్య )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు