ప్రియురాలి కోసం మాస్టర్‌ ప్లాన్‌.. ఆన్‌లైన్‌లో బొమ్మ తుపాకీ కొని

11 Aug, 2021 08:40 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌ బర్దార్‌

శ్రీకాకుళం: ఇచ్ఛాపురం పట్టణంలో బొమ్మ తుపాకీ చూపించి నగలు ఎత్తుకుపోయిన కేసును పోలీసులు ఛేదించారు. కేసు దర్యాప్తులో ఈ చోరీ వెనుక ఉన్న ‘లవ్‌ స్టోరీ’ బయటపడింది. ప్రియురాలికి బహుమ తి ఇవ్వడానికే యువకుడు దొంగతనానికి పాల్పడినట్లు తెలిసి ఖాకీలు కూడా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ అమిత్‌ బర్దార్‌ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాయగడ జిల్లా చలకంబ గ్రామానికి చెందిన సూరజ్‌ కుమార్‌ కద్రక ఒడిశాలోనే పదో తరగతి వరకు చదివాడు. అనంతరం భీమవరంలోని రొయ్యల ట్యాంకుల వద్ద, విశాఖపట్నంలోని ఒక హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశాడు.

2020 డిసెంబర్‌ నెలలో తన చిన్నాన్నకు చికిత్స జరుగుతున్న సమ యంలో ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కోవిడ్‌ కాలంలో ఉపాధి కోల్పోయి ఇంటిలోనే ఉండిపోయాడు. అయితే ప్రియురాలి మెప్పు పొందడం కోసం బంగారు గొలుసు ఇద్దామనుకున్నాడు. చేయడానికి పనులు లేకపోవడంతో చోరీ చేసి బహుమతి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో చూపించినట్టు బొమ్మ తుపాకీ చూపించి వ్యాపారిని బెదిరించి నగలు ఎత్తుకెళ్లాడు కూడా. కానీ పోలీసుల ముందు అతడి ఎత్తులు చెల్లలేదు.  

ఇలా దొరికిపోయాడు.. 
దొంగతనం చేద్దామని ప్లాన్‌ వేసిన సూరజ్‌కుమార్‌ రూ. 2వేలతో బొమ్మ పిస్టల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నా డు. 9వ తేదీన ఇచ్ఛాపురంలో జీకే జుయలరీ షాపు ను ఎంచుకుని తన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాపు ఓనర్‌ ఒంటరిగా ఉండడంతో కస్టమర్‌ లాగా లోపల కు వెళ్లాడు. వివిధ డిజైన్లతో మూడు బంగారు గొలుసుల ను ఓనర్‌ చూపించగా.. వాటిని ఫొటో తీసి తన లవర్‌కు పంపించాడు. ఆ సమ యంలో దుకాణానికి ఎవరూ రా కపోవడం గమనించి పిస్టల్‌ తీసి ఓనర్‌ ను బెదిరించి దాదాపు రెండు తులాల బరు వు గల మూడు గొలుసులు తీసుకుని పారిపోయా డు. దీనిపై ఆ షాపు ఓనర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఇచ్ఛాపురం రూరల్‌ పోలీస్‌ కానిస్టేబుల్, మరికొందరు నిందితుడిని వెంబడించారు.

వారి నుంచి తప్పించుకునే క్రమంలో బొమ్మ పిస్టల్‌ కిందపడిపోయింది. తర్వాత నిందితుడు ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర గొలుసులతో సహా పోలీసులకు దొరికిపోయాడు. అతడిని ఇచ్ఛాపురం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లారు. వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండా లని ఎస్పీ సూచించారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరచిన సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్‌ బషీర్‌లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ఎం.వీరకుమార్, సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు