రుణమిస్తామని రూ.కోటి టోపీ

15 Feb, 2022 11:18 IST|Sakshi

యశవంతపుర: కావలసినంత అప్పులు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన ఐదు మందిని ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైసూరుకు చెందిన విన్సన్‌ అనే వ్యక్తి గార్మెంట్స్‌ పరిశ్రమను స్థాపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అతని గురించి తెలుసుకున్న సంతోష్, సందేశ్‌లు అప్పు ఇప్పిస్తామని స్నేహం చేశారు. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో సమావేశమై విన్సన్‌కు పెద్దమొత్తంలో రెండువేల నోట్లను చూపించారు. రూ.నూరు కోట్లు అప్పు కావాలంటే రూ. కోటి కమీషన్‌ ఇవ్వాలని చెప్పి డబ్బు తీసుకున్నారు. కొన్నిరోజుల తరువాత సంతోష్, సందేశ్‌లు పత్తా లేరు. విన్సన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్, సందేశ్‌లతో పాటు ఐదు మందిని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు