సహజీవనం: అప్పు చెల్లించమన్నందుకు ప్రియురాలి హత్య

3 Mar, 2021 11:19 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన ప్రియురాలిని హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన బేగారి లక్ష్మీ అనే మహిళ భర్త కొంతకాలం కిందట మరణించాడు. భర్త మృతితో ఒంటరిగా ఉంటున్న లక్ష్మి పద్దేముల్‌ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన నర్సింలుతో సహాజీనవం చేస్తోంది. ఈ క్రమంలో లక్ష్మీ, నర్సింలుకు 50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని లక్ష్మీ నర్సింలును పలుమార్లు కోరింది.

దీంతో డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమోనని అతడు లక్ష్మిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వారం రోజుల క్రితం డబ్బు ఇస్తానని లక్ష్మీని నమ్మించి తన వెంట తీసుకెళ్లాడు. నమ్మి నర్సింలు వెంట వెళ్లిన లక్ష్మిని రాస్నం అడవిలో దారుణంగా హత్య చేశాడు. లక్ష్మి కనిపించకపోడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నర్సింలును విచారించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో సీఐ జలంధర్‌ రెడ్డి, ఎస్‌ఐ అశోక్‌ బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

చదవండి: సుంకి చెక్‌ పోస్టు: సంచుల కొద్దీ నకిలీ నోట్ల పట్టివేత
             భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు