ఇంట్లో భోజనం చేస్తుండగా బైకుపై వచ్చి.. భార్య కళ్లముందే..

12 May, 2022 06:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చెన్నై): తంజై జిల్లాలో ఆడిటర్‌ను హత్య చేసిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తంజై కరంద చేరవై కారన్‌ వీధికి చెందిన మహేశ్వరన్‌ (55) ఆడిటర్‌. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకె 5వ వార్డు ప్రతినిధి రుక్మిణితో విరోధం ఉంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మహేశ్వరన్‌ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో బైకులో వచ్చిన రుక్మిణి కుమారుడు కార్తీక్‌తో సహా నలుగురు కత్తులతో అతని భార్య కళ్లముందే దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో మహేశ్వరన్‌ అదే చోట మృతి చెందాడు. తంజై వెస్ట్‌ పోలీసులు మృతదేహాన్ని తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో..

శిశువును విక్రయించిన వృద్ధురాలి అరెస్టు
తిరువొత్తియూరు: మదురై సమీపంలో చిన్నారిని విక్రయించిన వృద్ధురాలిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై మేలూర్‌ కోటై నత్తం పట్టికి చెందిన ఓ వివాహితకు శివగంగై జిల్లా కల్లల్‌ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె గర్భం దా ల్చింది. ఈమె భర్త విదేశాలలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు గత వారం క్రితం మగబిడ్డ  జన్మించింది. ఈ బిడ్డను వృద్ధురాలికి ఇచ్చి పెంచమని చెప్పినట్లు తెలిసింది. కానీ వృద్ధురాలు ఆ బిడ్డను విక్రయించారు. ఈ సంగతి తెలుసుకున్న వివాహిత ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి బిడ్డ ఎక్కడని ప్రశ్నించింది. ఆమె సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వృద్ధురాలి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

చదవండి: ఆమెకు 20, అతడికి 17.. బాలుడిని ఇంటికి పిలిచి.. 

మరిన్ని వార్తలు