యువతిని వెతికి ఇంటికి తీసుకొచ్చి, ఆపై.. స్పీడ్‌ బ్రేకర్స్‌ దగ్గర దొరికిపోయారు!

12 May, 2022 08:27 IST|Sakshi

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): యువతిని హత్య చేసి శవాన్ని తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. బెంగళూరు రాజరాజేశ్వరి నగరలో రఘు, దుర్గ దంపతుల ఇంట్లో తమిళనాడుకు చెందిన సౌమ్య (22) అనే యువతి పనిచేసేది. డబ్బుల విషయమై గొడవ జరిగి సౌమ్య ఎక్కడికో వెళ్లిపోయింది. గత సోమవారం సౌమ్యను వెతికి ఇంటికి తీసుకువచ్చిన రఘు, దుర్గ ఆమెను దారుణంగా కొట్టి చంపేశారు.

శవాన్ని శ్రీరంగపట్టణం వద్ద పారవేయాలని నాగరాజు, వినోద్‌ల సాయంతో శవాన్ని బైక్‌పై తీసుకెళ్లారు. రామనగర కలెక్టరేట్‌ ముందు స్పీడ్‌ బ్రేకర్స్‌ వద్ద శవం జారి కిందపడింది. అక్కడే ఉన్న పోలీసులు అనుమానంతో పరిశీలించగా గుట్టు రట్టయింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు.

చదవండి: వివాహేతర సంబంధం: అర్ధరాత్రి బైక్‌పై వస్తుంటే అడ్డగించి..

మరిన్ని వార్తలు