జైలు నుంచి వచ్చేసరికి భార్యకు రెండో పెళ్లి.. గర్భవతని తెలిసి అత్తను..

5 Sep, 2021 18:57 IST|Sakshi

ముంబై: జైలు నుంచి విడుదలైన ఓ వ్యక్తి తన అత్తను చంపినందుకు మళ్లీ అరెస్టు అయ్యాడు. నిందితుడుని ఇక్బాల్‌ అబ్బాస్‌ షేక్‌(42) గా గుర్తించారు. అతనిపై ముంబైలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అబ్బాస్‌ షేక్‌పై ముంబైలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. బుధవారం పూణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలైన షేక్‌ తన భార్యను వెతుకుంటూ అత్త షమల్‌ శ్యామ్‌ శిగామ్‌ ఇంటికి వెళ్లాడు. శిగామ్‌(61) తన కుమార్తెకు మళ్లీ వివాహం జరిగిందని, ఆమె ప్రస్తుతం గర్భవతని తెలిపింది.

చదవండి: పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని..

దీంతో కోపోద్రిక్తుడై అత్త శిగామ్‌పై అబ్బాస్‌ షేక్‌ విచక్షణారహితంగా దాడి చేశాడు. పార, కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైన శిగామ్‌ అక్కడిక్కడే మృతి చెందింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా..  శిగామ్‌ను కలుసుకోవడానికి అబ్బాస్‌ షేక్‌  వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై షేక్‌ స్నేహితులను విచారించగా.. అతడు పూణేలో ఉన్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. అక్కడ అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

చదవండి: అయ్యో పాపం.. టీవీ మీద పడి చిన్నారి మృతి, బర్త్‌డేకు తెచ్చిన గౌను వేసి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు